Saturday, June 30, 2012

రుక్మిణి కల్యాణం


రుక్మిణి కల్యాణం 





ధ్యానం :
కృష్ణ ధ్యానం ప్రసన్న పారిజాతాను వేత్రతోత్రైక ప్రాణయే
జ్ఞాన ముద్రాయ కృష్ణాయ గీతామృత రుహేనమః !
సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టకారిణే
నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే !!

ఓం శ్రీ కృష్ణాయ నమః

1 . శ్రుత్వా గుణాన్ భువనసుందర శ్రుణ్వతాం  తే నిర్విశ్య కర్ణ వివరైహ్ హరతోంగతాపం|
    రూపం దృశాం ద్రుశిమతాం అఖిలార్ధ లాభం త్వయ్యచ్చుతా విశతి చిత్త మపత్రపంమే ||

తాత్పర్యము:
ఓ భువన సుందరా! వినువారల శ్రవణ (చెవి) రంధ్రములలో ప్రవేశించి శరీర తాపమును హరించునట్టి నీ గుణములను వినిన దాననై, చూచువారాలకు సకల లాభములను కలిగించు నీ రూపమును గురించి వినినదాననై, ఓ అచ్చ్యుతా, సిగ్గును విడిచి, నా మనసు నీ యందు లగ్నమయినది.

2. కాత్వా ముకుంద మహతీ కులరూప శీల విద్యా వయో ద్రవిణ దామభిహి ఆత్మతుల్యం |
    ధీరాపతిం కులవతీన వృణీత కన్యాకాలే నృసింహ నరలోక మనోభిరామం ||

తాత్పర్యము
ఓ ముకుందా! కులము, రూపము, శీలము, విద్య, వయస్సు, ధనము, తేజస్సు, మొదలగు గుణములలో తనకు తగిన వాడయిన , లోక మనోహరుడయిన  పతిని, కులవతి, బుద్ధిమంతురాలగు ఏ కన్య వరించదు ?

3. తన్మేభవాన్ ఖలువృతః పతిహి అంగ! జాయామాత్మార్పితశ్చ భవతోత్ర విభో విదేహి |
    మావీరభాగ మభిమర్మతు చైద్య ఆరాత్ గోమాయు వన్మృగపతేహ్ బలిమంబుజాక్ష ||

తాత్పర్యము
ఓయీ! కావున నేను నిన్ను పతిగా వరించి, ఆత్మార్పణము చేసితిని. ఓ ప్రభూ! ఓ అంబుజాక్ష! నన్ను భార్యగా స్వీకరించుము. సింహము యొక్క ఆహారము నక్కలకు చెందనట్లు వలె, వీర శేఖరుడవయిన నీ భాగమగు నన్ను శిశుపాలుడు తీసుకొని పోకుండా చేయుము.

4. పూర్తేష్ట  దత్తనియమ వ్రతదేవవిప్ర గుర్వర్చనాదిభిరలం భగవాన్ పరేశః |
    ఆరాధితోయది గదాగ్రజ ఏత్యపాణిం గృహ్నతుమే న దమఘోష సుతాదయోన్యే ||

తాత్పర్యము
నేను పూర్వజన్మలయందు చెరువులు తవ్వించి, యాగములు చేసిన, దానములు చేసిన, తీర్ధయాత్రా నియమములను, వ్రతములను,  దేవతలను, బ్రాహ్మణులను, గురువులను పూజించినదాననయినచో,
భగవానుడయిన గదాగ్రజుడు (కృష్ణుడు) వచ్చి నన్ను స్వీకరించు గాక! శిశుపాలుడు మొదలగు ఇతరులు నన్ను కన్నెత్తి చూడకుండుగాక !

5. శ్వోభావినీ త్వమజితోద్వహనే విదర్భాన్ గుప్తస్సమేత్య పృతనా పతిభిహ్ పరీతః !
    నిర్మధ్య చైద్య మగధేశ బలం ప్రసహ్యమాం రాక్షసేన విదినో ద్వః వీర్యశుల్కాం ||

తాత్పర్యము
ఓ అజితా! రేపు జరగబోవు వివాహమునందు నీవు రహస్యముగా సేనలతో మా విదర్భకు వచ్చి శిశుపాలుడు మొదలగువారిని సంహరించి, పరాక్రమమును శుల్కముగా చెల్లించి నన్ను రాక్షస విధానమున వివాహము చేసుకొనుము.

6. అంతఃపురాంతర చరామ నిహత్య బంధూన్ త్వాముద్వహే కధమితి ప్రవదామ్యుపాయం |
    పూర్వేద్యురస్తి మహతీ కులదేవి యాత్రా యస్యాం బహిర్నవవధూహ్ గిరిజాముపేయాత్ ||

తాత్పర్యము
మా బంధువులను సంహరించకుండా, అంతఃపురము నందు సంచరించు నిన్ను పెండ్లియాడుట ఎట్లనేదవా? ఉపాయమును చెప్పెదను వినుము. వివాహమునకు ముందు ఉదయము నగరమునకు బయటనున్న గౌరీ దేవి మందిరమునకు వెళ్లి కొత్త పెండ్లి కూతురు గౌరిని పూజించుట మా కులాచారము.( కావున నీవు నన్ను అక్కడి నుండి తీసుకుని పొమ్ము.)

7. యస్యాంఘ్రి పంకజ రజ స్స్పపనం  మహాంతో వాంఛత్యుమాపతి రివాత్మతమోప హత్యైహి |
    యద్యంబుజాక్ష నలభేయ భవత్ ప్రసాదం జహ్యామ్యసూన్ వ్రత కృశాన్ సతజన్మభిహిస్యాత్ ||

తాత్పర్యము
తమ తమోగుణమును తొలగించుకొనుటకు ఉమాపతిని పూజించినట్లు వలె మహాత్ములు నీ పాదపద్మ ధూళి యొక్క స్పర్శను కోరుచున్నారో, అట్టి నిన్ను నేను కోరుకొనుచున్నాను. ఓ అమ్బుజాక్షా! అట్లు నీ  అనుగ్రహమును పొందలేక పోయినచో, వ్రతములచే కృశించి ప్రాణములు విడిచెదను. నూరు జన్మలకయిననూ నిన్నే పతిగా పొందెదను.

*********************************************************************************

హి గౌరీ శంకరార్ధాంగీ యధార్ధం శంకరప్రియే |
తధామాం కురు కళ్యాణీ కాంతం కాంతం సుదుర్లభాం !!

కాత్యాయనీ మహామాయే మహాయోగిన్యధీశ్వరి |
నందగోప సుతం దేవం పతిం మే కురుతేన్నమః ||

శంభుం జగన్మోహన రూపపూర్ణామ్ మిలోక్య లజ్యా కులితాం స్మితాడ్యాం |
మదూకమాలా స్వశకీకరాభ్యాం  సంవిభ్రతి అత్రిసుతాం భజేహం !!



No comments:

Post a Comment