Sunday, October 12, 2014

గురు భక్తుల కధలు - గేయం

గురు భక్తుల కధలు - గేయం
-------------------------------
(సద్గురు కృపతో - భావరాజు పద్మిని )

గురు భక్తుల కధలను వినరండి -గురు మహిమను కనుగొనరండి

ఆదిశంకరుడే ఆదిగురువని- ఆరాధించెను సనందుడు
ఆతని గురుభక్తికి మెచ్చి- అనుగ్రహించెను శంకరులు
అసూయతో తక్కిన శిష్యులు- ఆలోచించిరి కారణము
అనన్యభక్తిని నిరూపించగా -సంకల్పించెను తొలిగురువు
అద్దరినున్న సనందుని పిలిచి - గంగకు ఇద్దరి వేగరమ్మనె
ఆత్మను గురుని స్మరించి - నదిపై వేగమె పరుగిడె శిష్యుడు
అడుగడుగుకూ పద్మమొక్కటి -ఆవిర్భవించె గురుమహిమన
ఆ నదిపై మునగక నడచిన - సనందుడయ్యెను పద్మపాదుడు  
అచ్చెరువున శిష్యగణము - యెరిగిరి నిశ్చల గురుభక్తి మహిమ      || గురు భక్తుల ||

గురుసేవయే పరమార్ధమని - వేదధార్యుని చేరే దీపకుడు
గురుని వినయమున సేవించి - వేదవిద్యల అభ్యసించెను
గత జన్మకర్మల నివృత్తికై  - తా వ్యాధుల కృంగాలనె గురువు  
గురుని వీడక దీపకుడు  - గురుసేవకై కాశీ పయనమాయెను
ఘోర రూపమున గుడ్డియై - కుష్టువ్యాధితో కుమిలెగురవు
పుండ్లను కడిగి,మలమును తుడిచి - భిక్ష తెచ్చెను దీపకుడు
కసిరిన విసిరిన కలత చెందక - సహనము వీడక సేవచేసేను
గురుని సేవయే సకల పూజలని- ప్రసన్నులాయిరి దేవతలు
అచంచల గురభక్తియే చాలని -  వరమడిగి తరించె దీపకుడు        || గురు భక్తుల ||




ధౌమ్యుని గురుకులమున నుండిరి – అరుణి ఉపమాన్యువు బైదులు
అరుణి పొలమునకు అడ్డుకట్టయై – గురుకృపచే యోగగురువయ్యెను  
బైదుడు గురువాజ్ఞను క్షేత్రమును- సాగుచేసేను కాయకష్టమున
పంటను ఇంటికి తెచ్చు త్రోవలో – కాడెద్దులు కుంటుపడెను
తానే బండిలాగుతూ సోమ్మసిల్లగా- గురువు బ్రోచి విద్యలనిచ్చెను
ఉపమాన్యుడు గురుఆజ్ఞ మీరక – ఆహారము వీడి ఆకుల తినెను
గుడ్డివాడుగా కూపమున పడగా – కరుణను గురువే కనికరించెను
అశ్వినీ దేవతల కరుణను పొంది – చదువకయే సకలజ్ఞాని అయ్యెను
ఉద్దాలకుడను శిష్యుని గురువై – దేవతలు మెచ్చే గురువాయెను    || గురు భక్తుల ||

గురుమహిమను చాటి చెప్పగా –భాషయే అవిటై మూగాబోవును
చండాలునిచే వేదము చెప్పించే – భక్తుల ‘దత్తుడు’ దత్తాత్రేయుడు
చాకలిని రాజును చేసెను – కరుణామయుడు శ్రీపాదవల్లభుడు
నరహరి శర్మను కృపతో కాచి – కుష్టు మాపెను నృసింహసరస్వతి
మాణిక్య ప్రభువుగ మహిమచూపి  – స్వామిసమర్ధగ అవతరించెను
షిరిడి సాయిగా వెలసిన దత్తుడు – ప్రేమతో మార్గదర్శకుడాయెను
గురుచంద్రుడే శిష్యుల కావగ  – షోడశావతారములను దాల్చెను
ఇత్తడి పుత్తడి సేయు పెన్నిధే – సద్గురువనే ఘన పరశువేది
గురుపాదుకలే వదలక పట్టిన – దక్కనిదేదీ లేదీ జగమున       || గురు భక్తుల ||

No comments:

Post a Comment